May 27 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్.. స్వల్ప నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 27 Market Analysis | జియో పొలిటికల్ టెన్షన్స్(Geopolitical tensions) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీగా వైమానిక దాడులు జరిపింది.

ఇంకోవైపు హోర్ముజ్ జలసంధి సమీపంలోని లక్ష్యాలపై దాడి చేయడం ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ప్రధానంగా అమెరికా -ఇరాన్ ల మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దీంతో ప్రపంచ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బుధవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

May 27 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

సెమీకండక్టర్ స్టాక్స్‌లో ర్యాలీ కారణంగా వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.19 శాతం, ఎస్ అండ్ పీ 0.61 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.

May 27 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.04 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.81 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.24 శాతం పెరిగింది.

May 27 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 4.81 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.34 శాతం లాభాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.83 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.67 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.32 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.21 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.10 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీల ప్రతికూల ప్రారంభాన్ని సూచిస్తోంది.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,407 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 7వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,361 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.26 నుంచి 1.07 కు తగ్గింది.
  • విక్స్ 3.41 శాతం తగ్గి 16.13 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.50 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు బలహీనపడి 95.68 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.12 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.48 వద్ద ఉన్నాయి.
  • బక్రీద్ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు. దీంతో సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీతోపాటు మంత్లీ ఎక్స్‌పైరీ ఒకరోజు ముందుకు జరిగింది. ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

Bihar DSP Gautam Kumar | అధికార బలం.. అక్రమ ధనం…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *