Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో సెషన్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 555 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు పడిపోయాయి

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతుండడం, ముడి చమురు ధరలు బ్యారెల్ వంద డాలర్లకు చేరువవడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారింది. గ్లోబల్ క్యూస్ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం ఒత్తిడికి గురయ్యాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 42 పాయింట్లు పెరిగింది. ఇంట్రాగే గరిష్టాలనుంచి 459 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 15 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేక 135 పాయిట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 555 పాయింట్ల నష్టంతో 75,577 వద్ద, నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 23,635 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,096 కంపెనీలు లాభపడగా 2,291 స్టాక్స్ నష్టపోయాయి. 222 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 205 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 110 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 స్టాక్ లాభపడగా.. 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 1.48 శాతం, అదానీపోర్ట్స్ 1.06 శాతం, హెచ్యూఎల్ 0.84 శాతం, ఇండిగో 0.49 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.23 శాతం లాభపడ్డాయి.

Top losers : ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.72 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.23 శాతం, కొటక్ బ్యాంక్ 1.20 శాతం, రిలయన్స్ 1.16 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Kanohar Electricals IPO | ఐపీవోకు ట్రాన్స్ఫార్మర్స్ తయారీ కంపెనీ.. ఊరిస్తున్న జీఎంపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *