అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 23 Market Analysis | అమెరికా(America), ఇరాన్‌ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపించడం, సౌదీ అరేబియా చమురు సరఫరాలో కీలకమైన పైప్‌లైన్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టడంతో ముడి చమురు(Crude oil) ధరలు దిగివస్తున్నాయి. సానుకూల సంకేతాలు కనిపిస్తున్నా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి.
Sep 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.45 శాతం లాభపడగా.. ఎస్ అండ్ పీ ఫ్లాట్‌గా ముగిసింది. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
Sep 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.20 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.02 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.29 శాతం నష్టపోయింది.
Sep 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.79 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.12 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.91 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.24 శాతం, సింగపూర్ Singapore కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.07 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 3,809 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 30 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,120 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 95.59 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.67 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతం వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.74 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.2 నుంచి 0.94కు పడిపోయింది.
- విక్స్ 2 శాతం తగ్గి 10.99 వద్ద ఉంది.