అక్షరటుడే, వెబ్‌డెస్క్: UNSC India Permanent Membership | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా యూరప్‌కు చెందిన కీలకమైన నాలుగు దేశాల కూటమి ‘V4’ (విసెగ్రాడ్ గ్రూప్) భారత్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది.
UNSC India Permanent Membership | శక్తివంతమైన సూపర్ పవర్‌గా భారత్
న్యూయార్క్‌లో జరిగిన UN జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో V4 దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్లోవేకియా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ… “ప్రస్తుత ప్రపంచంలో ‘గ్లోబల్ సౌత్’, ‘ఇండో-పసిఫిక్’ ప్రాంతాల్లో భారత్ శక్తివంతమైన సూపర్ పవర్‌గా ఎదుగుతోంది. మారుతున్న ప్రపంచ సమీకరణాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి అత్యున్నత విభాగమైన భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాల్సిందే” అని స్పష్టం చేశారు.
UNSC India Permanent Membership | భారత్ – V4 కొత్త మైత్రి ఒప్పందాలు
కేవలం మద్దతు ప్రకటించడమే కాకుండా, భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు V4 కూటమి (పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్) ముందుకు వచ్చింది. ఏటా విదేశాంగ మంత్రుల స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం పెంచేందుకు ‘వార్షిక బిజినెస్ ఫోరమ్’ ఏర్పాటు చేయనున్నారు.
Trump Media Lawsuit | ట్రంప్‌పై CNN, MS NOW, Politico సంయుక్తంగా దావా!
Super Intelligence | AIకి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ పదం?.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రతిపాదన!
రక్షణ (Defense), అత్యాధునిక సాంకేతికత (Technology), అంతరిక్ష పరిశోధనలు (Space) మరియు విద్యార్హతల పరస్పర గుర్తింపు వంటి కీలక రంగాల్లో కలసి పనిచేయడానికి అంగీకారం కుదిరింది.
UNSC India Permanent Membership | UNSC సంస్కరణలు ఎందుకు అనివార్యం?
1945లో ఏర్పాటు చేసిన భద్రతా మండలి నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులకు ఎంతమాత్రం సరిపోదని భారత్ చాలాకాలంగా వాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అత్యంతవేగంగా ఎదుగుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, UN శాంతిభద్రతల పరిరక్షణ (Peacekeeping) దళాలకు అత్యధికంగా బలగాలను అందిస్తున్న భారత్‌కు స్థానం లేకపోవడం ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతకే ప్రశ్నార్థకంగా మారింది.
UNSC India Permanent Membership | చైనా వ్యతిరేకతను సైతం అధిగమించేలా..
ప్రస్తుతం UNSC లోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో (P5) అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు ఇప్పటికే భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. మిగిలిన ఏకైక ప్రతిబంధకమైన చైనా వ్యతిరేకతను సైతం అధిగమించేలా, అంతర్జాతీయంగా భారత్ వరుస డిప్లొమాటిక్ విజయాలను సాధిస్తుండటం విశేషం.
V4 గ్రూప్ వంటి యూరోపియన్ కూటముల మద్దతుతో, భారత్ UNSC శాశ్వత సభ్యత్వ పోరాటంలో మరో కీలక ముందడుగు వేసినట్లయింది.