Puducherry Police | పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా

పుదుచ్చేరి పోలీసులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అభినందనలు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Puducherry Police | ప్రతిష్టాత్మకమైన ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ గౌరవాన్ని అందుకున్న పుదుచ్చేరి పోలీసులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అభినందనలు తెలిపారు. ఆ బలగాల కృషి, శౌర్యం, సేవాభావం, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

పుదుచ్చేరి పోలీసు శాఖలో 5,000 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ, ఆ ప్రాంత వారసత్వాన్ని కాపాడుతూనే అంతర్గత భద్రత, గౌరవాన్ని పరిరక్షించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని షా అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పుదుచ్చేరి దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యానికి ఒక సజీవ ప్రతీక అని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన ఏ బలగ చరిత్రలోనైనా ‘ప్రెసిడెంట్స్ కలర్’ అనేది అత్యంత గర్వించదగ్గ ఘట్టం అన్నారు.

Puducherry Police | ఫ్రెంచ్​ పాలనలో సైతం..

30 ఏళ్లపాటు ఫ్రెంచ్ పాలనలో ఉన్నప్పటికీ, పుదుచ్చేరి తన భారతీయతను, ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకుందని అమిత్​ షా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, పౌరులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను తీసుకువచ్చిందని షా పేర్కొన్నారు. ఈ కొత్త క్రిమినల్ చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు.

దీనిని కూడా చదవండి : Akali Dal BJP Alliance | మళ్లీ బీజేపీ-అకాలీదళ్‌ పొత్తు? మోడీతో భేటీ తర్వాత సుఖ్‌బీర్‌ బాదల్‌ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *