అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయని, దీనిని తాము ఒప్పుకోం అన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం మీడియాతో మాట్లాడారు. అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీక అని ఆరోపించారు. ప్రధాన్‌ను విద్యాశాఖ నుండి వేరే శాఖకు మార్చడమే పరిష్కారమని మోదీ మంత్రివర్గంలో చర్చ జరుగుతోందన్నారు. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మరియు యువతపై దాడి చేస్తున్న వ్యవస్థ ఇదని విమర్శించారు. ప్రభుత్వం ఎంత శక్తిని ప్రయోగించినా, ప్రతి ఒక్కరూ కలిసి ప్రయత్నించినా విద్యార్థులను నిరసన స్థలం నుంచి కదిలించలేరన్నారు. తాము వెనక్కి తగ్గమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు అన్నారు. ఎవరూ వారితో పోరాడలేరని పేర్కొన్నారు.
Dharmendra Pradhan Resignation | ప్రధాని క్షమాపణ చెప్పాలి
పోలీసుల లాఠీచార్జీలో ఎంతో మంది విద్యార్థులు గాయపడ్డారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారు, దీనిని నిర్వహించిన, అమలు చేసిన వారు శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దీనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుడు, అసమర్థుడు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Foreign Funding Allegations | సీజేపీకి విదేశీ నిధులు.. కేంద్రం క్లారిటీ