Telangana University Water Crisis | తెయూలో నీటి కటకట.. రోడ్డెక్కిన విద్యార్థినులు

తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్​లో గత కొన్ని రోజులుగా నీటిసమస్యతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Water Crisis | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) గర్ల్స్ హాస్టల్​లో గత కొన్ని రోజులుగా నీటిసమస్య ఇబ్బందులు పెడుతోందని విద్యార్థినులు పేర్కొంటున్నారు. కనీస అవసరాలకు కూడా తగినంత నీరు అందుబాటులో లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం వారు వర్సిటీలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

Telangana University Water Crisis | అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ..

రోజువారీ అవసరాలకు..ఇతరత్ర పనులకు నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల భయంతో ఈ విషయాన్ని విద్యార్థినులు బయటికి చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. 15 రోజులలో ఏ ఒక్కరోజు కూడా పూర్తిగా నీటి సరఫరా జరిగిన దాఖలాలు లేవని .. ప్రతిరోజూ ఏదో సమస్య చెబుతూ.. వస్తున్నారని మొరపెట్టుకున్నారు.

Telangana University Water Crisis | అసలే వర్షాకాలం-వ్యాధుల భయం

ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యాభ్యాసంపై నీటి సమస్య ప్రతికూల ప్రభావం చూపుతోందని విద్యార్థినులు అంటున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ‎కాగా పీజీ, ఎల్​ఎల్​బీ, ఇంటిగ్రేటెడ్​తో పాటు ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థినులు సైతం తోడవడంతో ఉన్న ఒక్క బాలికల వసతిగృహంలోనే వసతి పొందుతున్నారు. అటు మరో నూతన బాలికల వసతి గృహం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నేపథ్యంలో ఇటు వసతి గృహంలో సమస్యలు విద్యార్థినులకు అసౌకర్యంగా మారాయి. ‎

ఇది కూడా చదవండి..: Telangana Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు భారీ వర్షాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *