అక్షరటుడే, కామారెడ్డి: Congress Joining Rules | కాంగ్రెస్ పార్టీలో చేరికలు క్రమబద్ధమైన విధానంలోనే జరగాలని, అనధికారికంగా నిర్వహించే చేరికలకు ఎలాంటి గుర్తింపు ఉండదని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Congress Joining Rules | జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల సమక్షంలో
ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే ముందుగా సంబంధిత మండల లేదా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమక్షంలోనే అధికారికంగా చేరికలు నిర్వహించాలని తెలిపారు.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Congress Joining Rules | వ్యక్తిగతంగా చేరికలు నిర్వహిస్తే..
పార్టీ నియమాలను విస్మరించి వ్యక్తిగతంగా చేరికలు నిర్వహిస్తే వాటిని చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబోమని, అలాంటి చేరికలకు పార్టీ గుర్తింపు ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, సంస్థాగత వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించిన మార్గదర్శకాల మేరకు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మండల, టౌన్ అధ్యక్షులకు ఏలే మల్లికార్జున్ సూచించారు.