TPCC Chief Mahesh Goud | ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధం : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

దానం నాగేందర్​పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ స్పందించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: TPCC Chief Mahesh Goud | పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్​ గౌడ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్​ (Danam Nagender) అనర్హత పిటిషన్​పై ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ సిద్ధమని ప్రకటించారు.

మహేశ్​ గౌడ్​ శనివారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేయాలనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. మంత్రి పదవులపై నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డిదే అని పేర్కొన్నారు.

TPCC Chief Mahesh Goud | బీఆర్​ఎస్​ ప్రోత్సహించింది

పార్టీ ఫిరాయింపులను గతంలో బీఆర్‌ఎస్‌ ప్రోత్సహించిందని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్‌కు విపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు. సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. 2014, 2018లోనూ పార్టీ ఫిరాయింపులు జరిగాయని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో అనేక నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.బీఆర్‌ఎస్‌ గతంలో చేసిన ఫిరాయింపులను ఇప్పుడు ఆ పార్టీ నేతలు మరిచిపోయారని వ్యాఖ్యానించారు. టీఎంసీ, శివసేన, ఎన్‌సీపీని బీజేపీ చీల్చిందని, మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. పాత బీజేపీ నేతలకు ఉన్న విలువలు ప్రస్తుత నేతలకు లేవని మహేశ్ గౌడ్​ అన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *