NEET Exam | ‘నీట్’ అభ్యర్థికి సీఐ చేయూత.. పోలీస్​ వాహనంలో పరీక్ష కేంద్రానికి..

పొరపాటున వేరే పరీక్ష కేంద్రానికి వెళ్లిన నీట్​ అభ్యర్థికి ఓయూ ఇన్​స్పెక్టర్​ అండగా నిలిచారు. పోలీస్​ వాహనంలో ఆమెను పరీక్ష కేంద్రానికి తీసుకు వెళ్లారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | దేశవ్యాప్తంగా ఆదివారం నీట్​ రీ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. అయితే ఒక్క నిమిషం నిబంధనతో ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నీట్‌ ఎగ్జామ్ సెంటర్ తెలియక కంగారు పడుతున్న విద్యార్థినిని ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో ఎక్కించుకుని సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి పంపించారు. దీంతో ఆమె పరీక్ష రాసింది. ఓ విద్యార్థిని పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి చేరుకుంది.  ఆమె తన తండ్రితో కలిసి వచ్చింది.  ఆయన వద్ద వాహనం కూడా లేదు. దీంతో పరీక్ష కేంద్రానికి బస్సులో వెళ్తే ఆలస్యం అవుతుందని ఆందోళనకు గురైంది. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించరు.

NEET Exam | ఇన్​స్పెక్టర్​ సాయంతో..

neet 2

విద్యార్థిని విషయం తెలుసుకున్న ఓయూ ఇన్​స్పెక్టర్​ మహేశ్​కుమార్​ గౌడ్​ వెంటనే స్పందించారు. ఆమెను పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.  దీంతో సకాలంలో ఎగ్జామ్​ సెంటర్​కు చేరుకున్న విద్యార్థి పరీక్ష రాసింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇన్​స్పెక్టర్​ను అభినందిస్తున్నారు. కాగా ఆయన స్పందించకుంటే ఆ విద్యార్థిని ఈ ఏడాది పరీక్షకు దూరం అయ్యేది. ఫలితంగా ఏడాది చదువుకు దూరం అయ్యేది.

దీనిని కూడా చదవండి : KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *