KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మంత్రుల మాఫియా నడుస్తుందని కేటీఆర్​ ఆరోపించారు. ఆ దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా నడుస్తుందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) అన్నారు. దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

కేటీఆర్​ ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో బస్తీ బాటలో పాల్గొన్నారు. 60 సంవత్సరాలుగా బస్తీలో నివాసం ఉంటున్న తమను తరలించి ఆ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్​ రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు.

KTR Sensational Comments | సీఎంకు సవాల్​

సీఎం రేవంత్‌ (CM Revanth)కు కేటీఆర్‌ సవాల్ విసిరారు. మహిళలను కోటీశ్వరులను చేయడం కాదు.. ముందు మహిళలకు పెండింగ్‌లో పెట్టిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అత్తకు రూ.4 వేలు, కోడలికి రూ.2500 ఇస్తామన్నారని గుర్తు చేశారు. మీరు హామీ అమలు చేస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.

KTR Sensational Comments | బడే భాయ్​, చోటే బాయ్​ కలిసి..

మూసీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములను అప్పగించిందని కేటీఆర్ తెలిపారు. పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారని విమర్శించారు.

KTR Sensational Comments | రేవంత్​రెడ్డి అట్టర్​ ప్లాఫ్​

అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే.. ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందన్నారు. తెలిసో తెలియకో పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే వాళ్లకు పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కానీ ఈరోజు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయిన తర్వాత.. పక్కకెళ్లి పోతే కూర్చున్న కుక్క కూడా లేవదన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Congress Promises | సీఎం రేవంత్​రెడ్డికి బీజేపీ అధ్యక్షుడి లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *