అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TGPSC Notification | నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖలో పట్టణ ప్రణాళిక సహాయ సంచాలకుని పోస్టులను భర్తీ చేయడానికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 6 నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. పోలీస్ శాఖలో 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అనుమతి ఇచ్చింది.
TGPSC Notification | పోస్టుల వివరాలు
తాజాగా టీజీపీఎస్సీ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మల్టీజోనల్ కేడర్‌కు చెందిన ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, ఎంఏ (జాగ్రఫీ), ఎంఎస్సీ (జాగ్రఫీ), ఎంఎస్సీ (జియోఇన్ఫర్మెటిక్స్) లేదా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో డిప్లోమా.. వీటిలో ఏదైనా ఒకటి చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనిని కూడా చదవండి : Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్