అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cheriyal Tahsildar Bribery | లంచం తీసుకుంటూ తహశీల్దార్ దొరికిపోయాడు. నాలా కన్వర్షన్ కోసం రూ.70 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు.
సిద్దిపేట (Siddipet) జిల్లా చేర్యాల తహశీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ నాలా కన్వర్షన్ (NALA conversion) కోసం లంచం డిమాండ్ చేశాడు. మండలంలోని నాగపురి గ్రామంలో జమున, కనకమ్మ ఇతరుల పేర్ల మీద 30 గుంటల విస్తీర్ణం గల సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/E లకు సంబంధించిన 11 నాలా మార్పిడి దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి రూ.70 వేలు అడిగాడు. ఇందులో ఇప్పటికే 8 ఇప్పటికే ప్రాసెస్ చేశారు. రూ.70 వేలు ఇస్తేనే మిగతావి చేస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఫిర్యాదుదారుల నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.
Cheriyal Tahsildar Bribery | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. నిబంధనల ప్రకారం భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ఆపరేటర్‌కు కనీసం రూ.వెయ్యి ఇవ్వాల్సిందే. చివరకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) కోసం కూడా లంచం అడుగుతున్నారు. ఆపరేటర్ నుంచి మొదలు పెడితే ఆర్ఐ (RI), తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. పలువురు సర్వేయర్లు అయితే.. పైసలు ఇస్తేనే సర్వే చేయడానికి వస్తున్నారు. లేదంటే నెలల తరబడి దరఖాస్తును పెండింగ్‌లో పెడుతున్నారు.
Cheriyal Tahsildar Bribery | డ్రైవర్లు, అటెండర్ల ద్వారా..
తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారులు ఎక్కువగా అటెండర్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. కొందరు అధికారులు నేరుగా వసూలు చేస్తున్నారు. పలువురు తహశీల్దార్లు నేరుగా తీసుకోకుండా తమ కారు డ్రైవర్ల ద్వారా దందా చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను కారు డ్రైవర్లుగా పెట్టుకొని లంచాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. కొంత మంది అధికారులు కార్యాలయంలోని కొందరిని ఈ పని కోసం వాడుకుంటున్నారు. ఏసీబీ నిత్యం దాడులు చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక