అక్షరటుడే, బాన్సువాడ: Mosra Pond Tragedy | మోస్రా(Mosra) మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు.
Mosra Pond Tragedy | కాలకృత్యాల కోసం వెళ్లి..
వర్ని(Varni) ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కె లక్ష్మణ్ (25) సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువు వద్దకు కాలకృత్యాల నిమిత్తం వెళ్లాడు. అయితే అక్కడ మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగి మృతి చెందాడు. లక్ష్మణ్ కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ముస్కె అనంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి: చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాల ఆమోదం