Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో ఇంటింటి సర్వే ప్రారంభం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy House Survey | జాతీయ జనగణనలో(Census) కీలకమైన గృహజాబితా (census update) సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేటర్లు గడపగడపకు వెళ్లి వివరాలను డిజిటల్‌గా ‘హెచ్‌ఎల్‌పీసీ’ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి(Kamareddy) జిల్లాలో మొత్తం 2.65 లక్షల గృహాలు ఉండగా, ఇందుకోసం 1,954 మంది ఎన్యుమరేటర్లను, వీరి పనిని పర్యవేక్షించేందుకు 310 మంది సూపర్‌వైజర్లను నియమించారు. మొదటి రెండు, మూడు రోజులు ఇళ్ల మ్యాపింగ్, నంబర్లు కేటాయించే పనులు చేస్తారు. జనగణనలో భాగంగా గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం కల్పించగా, జిల్లాలో 80శాతం ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారు ఉన్నప్పటికీ ఈ నెల 9వ తేదీ వరకు కేవలం 9,631 మంది మాత్రమే స్వీయగణన పూర్తి చేశారు.

Kamareddy House Survey | కొన్ని గ్రామాల్లో శతశాతం..

కొన్ని పల్లెలు శత శాతం పూర్తి చేస్తే, మరికొన్ని గ్రామాల్లో స్పందన కరువైంది. ప్రతి ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబీకులు, కొన్ని వసతులు (తాగునీరు, విద్యుత్​, శౌచాలయాలు, ఇతర) ఇలా 33 రకాల వివరాలను ‘హెచ్‌ఎల్‌పీసీ’(HLPC) యాప్‌లో నమోదు చేస్తారు. ఆయా వీధులో ఉన్న అలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలను పొందుపరుస్తారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాస్థాయిలో జనగణన ప్రక్రియకు ముఖ్య గణాంకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. అనంతపుర కలెక్టర్ (రెవెన్యూ) అతనవ ముఖ్య గణాంకాధికారిగా, డీఆర్​వో గణాంకాధికారిగా పర్యవేక్షిస్తారు. సీపీవో, డీఈఓ, జడ్పీ సీఈవో, డీఎంఈవో ఆదినేతృత్వ అధికారులుగా, పురపాలకాల కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు అధికారిగా, ఎంపీడీఓ, అటవీశాఖ టాస్క్ ఎనిస్టార్ అధికారులుగా ఉంటారు.

Kamareddy House Survey | తస్మాత్​ జాగ్రత్త..

జనగణన ముసుగులో కొందరు ఇళ్లలోకి వచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. గణనకు వచ్చే వారు నిజమైన అధికారులేనా అని తెలుసుకోవడం ప్రధానం. ప్రభుత్వం ప్రతి ఎన్యుమరేటర్‌కు ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేసింది. వాటిని తనిఖీ చేసి ధరించాలి. ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *