Travel Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Travel Bus Accident | సూర్యాపేట (Suryapeta) జిల్లాలోని కోదాడ పట్టణం సమీపంలో ఉన్న జాతీయ రహదారి (NH-65) పై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.

కాకినాడ నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ఒక ‘Yolo’ ప్రైవేట్ బస్సు, ముందు వెళ్తున్న ఒక లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆరుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు నిద్రమత్తు ఆవహించడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Travel Bus Accident | బస్సు, కారు ఢీ

రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ సమీపంలో యూటర్న్ వద్ద ఆర్టీసీ బస్సు, బ్రీజా కారు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం..ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. వారందరినీ సురక్షితంగా ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలవ్వగా.. స్థానిక చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దీనిని కూడా చదవండి : Tractor Accident Makloor | ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *