Municipal Commissioner Visit | డివిజన్లలో మున్సిపల్​ కమిషనర్​ పర్యటన.. సమస్యలపై ఆరా..

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Commissioner Visit | నగర పాలక సంస్థ(Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం ఆయా డివిజన్లలో పర్యటించారు. 53వ డివిజన్ పరిధిలోని హష్మీ కాలనీ, శాంతినగర్, పీలా స్కూల్ తదితర ప్రాంతాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించారు.

Municipal Commissioner Visit | శానిటేషన్​.. తాగునీటి సరఫరా..

ప్రధానంగా శానిటేషన్(Sanitation) నిర్వహణ, తాగునీటి సరఫరా (Drinking Water Supply) గురించి స్థానికులను మున్సిపల్​ కమిషనర్​(Municipal Commissioner) ఆరా తీశారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అక్కడక్కడా రోడ్లపై పేరుకుని ఉన్న చెత్తకుప్పలను గమనించి, వెంటనే తొలగింపజేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని స్థానికులకు సూచించారు. కాగా, నీటి సరఫరా తీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ 9వ డివిజన్​లోని ఆయా ప్రాంతాలను సందర్శించారు. కమిషనర్ వెంట సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, అధికారులు ఇనాయత్, సాజిద్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Gandhi Bhavan | గాంధీ భవన్ ఎదుట ఉద్యమకారుల ఆందోళన

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *