అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ (Excise Department) ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. నగరంలోని ఆయన నివాసంలో ఉదయం నుంచే సోదాలు జరిగాయి.
ACB Raids | నగరంలోని ఆయన నివాసంలో..
నగరంలోని (Nizamabad) ప్రగతినగర్‌లోని సూపరింటెండెంట్ మల్లారెడ్డిలో ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. అలాగే రాష్ట్రావ్యాప్తంగా ఆయనకు సంబంధించిన వారి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నఏసీబీ అధికారులు.. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ సోదాలు..