BRS Leaders Arrest | బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. తాడ్వాయి రైతు ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: BRS Leaders Arrest | యూరియా పంపిణీలో యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చేపట్టనున్న రైతు ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ముందు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను మంగళవారం తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

BRS Leaders Arrest | నిరసన కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా యూరియా యాప్ వ్యవహారంపై రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా రైతు సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తోంది.

ఈ క్రమంలో తాడ్వాయి మండల కేంద్రంలో భారీ ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొంటారని పార్టీ నాయకత్వం ప్రకటించింది. అలాగే రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చింది.

akshara today 1 1.jpgTRS 1

BRS Leaders Arrest | పోలీసుల అప్రమత్తం

ధర్నా నేపథ్యంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి మండలాలకు చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల చర్యలతో తాడ్వాయిలో నిర్వహించనున్న ధర్నాపై అనిశ్చితి నెలకొంది. కార్యక్రమానికి అనుమతి ఇస్తారా, ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం కల్పిస్తారా అనే అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

BRS Leaders Arrest | ఇంటి వద్దనే అరెస్టు

ఇదిలా ఉండగా, ఉదయం ఇంటి వద్దకే వచ్చి అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. యూరియా అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, యాప్ విధానం ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, రైతుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Mamata Banerjee TMC | బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMC చీఫ్​ పదవి నుంచి మమత తొలగింపు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *