అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Rain Forecast | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది.
రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు వర్షాలు తక్కువగా పడుతాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లా (Siddipet District)ల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు కురుస్తాయి.
Telangana Rain Forecast | అన్నదాతల హర్షం
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం అయిన నాటి నుంచి భారీ వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు సోమవారం వర్షాలు ఊరటనిచ్చాయి. పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వాన కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డిలో భారీ వర్షం పడింది. పెద్దపల్లిలోని శ్రీరాంపూర్‌లో రాత్రిపూట 173 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
Telangana Rain Forecast | హైదరాబాద్ నగరంలో..

హైదరాబాద్ నగరంలో సైతం సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. రాత్రి వరకు పొడిగా ఉన్న వాతావరణం అర్ధరాత్రి మారిపోయింది. సైబరాబాద్ ప్రాంతంలో కురిసిన అత్యంత భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవగా, ఈశాన్య హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. చందానగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో 100-130 మి.మీ మేర వర్షపాతం నమోదైంది.
ఇది కూడా చదవండి..: DTO Venkanna Death | డీటీఓ వెంకన్న దుర్మరణంపై రాజకీయ దుమారం.. స్పందించిన ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశం