వన్‌చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్ విజేతగా హైదరాబాద్ బిర్యానీ!

Shivam nagarani

భారతీయ బిర్యానీ సంప్రదాయాన్ని, రుచిలోని వైవిధ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లయన్సెస్ తయారీ సంస్థ ‘వర్సుని ఇండియా’ చేపట్టిన ‘వన్‌చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్’ హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్‌లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేతో ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు ఫుడ్ లవర్స్, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు , వంట నిపుణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.

ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ , తెలుగు నటి తేజస్వి మదివాడ ముఖ్య అతిథులుగా విచ్చేసి వేదికను అలంకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఎంపికైన ‘ఇండియాస్ ఫేవరెట్ బిర్యానీ’ని వీరు అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరమైన పోరులో హైదరాబాద్ బిర్యానీ అత్యధిక అభిమానాన్ని సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

ఈ ప్రచార కార్యక్రమంలో హైదరాబాద్, అవధి, కోల్‌కతా, బాంబే, సింధీ, కశ్మీరీ, కాన్పురీ, బెంగళూరు , గోవా ఫిష్ బిర్యానీలపై వినియోగదారులు అమితమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ లీగ్ ద్వారా వివిధ ప్రాంతీయ బిర్యానీల పట్ల ఉన్న అభిమానం మరింత పెరగడమే కాకుండా, వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని నిర్వాహకులు తెలిపారు. వన్‌చెఫ్ వంట పరికరం భారతీయ వంటిళ్లలో వంటను ఎంత సులభతరం చేయగలదో ఈ వేదికపై లైవ్ డెమో ద్వారా చెఫ్ రణవీర్ బ్రార్ వివరించారు.

ఈ సందర్భంగా వర్సుని ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పూజా బైడ్ మాట్లాడుతూ, ఆహారంతో భారతీయులకు ఉన్న భావోద్వేగ బంధాన్ని ఈ లీగ్ ఒక వేడుకలా మార్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాల నుండి స్ఫూర్తి పొంది, అర్థవంతమైన ఆవిష్కరణలను అందించడమే తమ సంస్థ నిబద్ధత అని ఆమె స్పష్టం చేశారు.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *