Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి గొప్ప మనసు.. బాలుడి చికిత్సకు చేయూత

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  (Venkat Reddy) గొప్ప మనసు చాటుకున్నారు. కంటి చూపు కోల్పోతున్న ఓ బాలుడికి అండగా నిలిచి మెరుగైన వైద్యం అందేలా చూశారు. దీంతో ఆ బాలుడు ప్రస్తుతం లోకాన్ని చూడగలుగుతున్నాడు.

దేవరకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్​ నాయక్​ అనే వ్యక్తి కుమారుడికి కంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ఎల్​వీ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. వారు ఆపరేషన్​కు భారీగా ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో వారు మంత్రి కోమటిరెడ్డిని (Minister Komatireddy) కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. పేదరికంలో ఉన్న తాము అంత డబ్బు ఖర్చు పెట్టలేమని ఆయనను వేడుకున్నారు.

Komatireddy Helped Boy | సాయం చేసిన మంత్రి

బాధితుల సమస్య విన్న మంత్రి వెంటనే స్పందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబానికి సాయం అందించి, చిన్నారికి అవసరమైన వైద్యం చేయించి తిరిగి చూపు వచ్చేలా చర్యలు చేపట్టారు.మంత్రి చొరవతో చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతమై, తిరిగి చూపు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆపదలో ఉన్న తమను ఆదుకున్న మంత్రికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ఆ వీడియో వైరల్​ అవుతోంది.

ఇది కూడా చదవండి..: GHMC MoU | ఐఐటీ ఖరగ్​పూర్​తో జీహెచ్​ఎంసీ ఒప్పందం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *