అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC MoU | అత్యంత అధునాతన ఏఐ ఆధారిత నీటి నాణ్యత పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలతో ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని (MoU) ప్రకటించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణను, దీర్ఘకాలిక నీటి పరిపాలనను బలోపేతం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పెక్ట్రల్ అనాలిసిస్, రియల్-టైమ్ పర్యావరణ పర్యవేక్షణ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగా అధునాతన నీటి పర్యవేక్షణ, ఏఐ-ఆధారిత కాలుష్య కారకాల గుర్తింపు, రియల్-టైమ్ పర్యవేక్షణ, హెచ్చరికలు ఉంటాయి.
GHMC MoU | సురక్షిత తాగునీరు అందించేందుకు..
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఈ ఒప్పందం చేసుకుంది. మొదట 12 నెలల పైలట్ దశలో హైదరాబాద్ వ్యాప్తంగా 25,000కు పైగా నీటి నమూనాలను విశ్లేషించి, రసాయన, మూలక, సూక్ష్మజీవ పారామితులను కవర్ చేస్తూ దాదాపు 19 లక్షల విశ్లేషణాత్మక డేటా పాయింట్లను సృష్టించనున్నట్లు అంచనా. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎంఎస్‌యూ) మద్దతు అందిస్తోంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Land Rover Crash | హైదరాబాద్లో ల్యాండ్రోవర్ కారు బీభత్సం