Hyderabad Land Rover Crash | హైదరాబాద్​లో ల్యాండ్​రోవర్​ కారు బీభత్సం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad Land Rover Crash | హైదరాబాద్​ (Hyderabad)నగరంలో ఓ ల్యాండ్​ రోవర్​ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. హైటెక్​సిటీలోని మెడికవర్​ హాస్పిటల్ సమీపంలో ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.

అతివేగంగా వస్తున్న ఒక విలాసవంతమైన ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారు (Land Rover Defender) అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆ తర్వాత పల్టీలు కొడుతూ వెళ్లింది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని (#DrunkAndDrive) స్థానికులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న కొందరు యువకులు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారని, వారు అక్కడి నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Land Rover Crash | రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో లారీ ఢీకొని నవ వధువు మృతి చెందింది. బండ్లగూడలోని నూరీనగర్‌కు చెందిన ఫాతిమా బేగం (25)కు మూడు నెలల క్రితం వివాహం అయింది. గురువారం రాత్రి ఆమె తన భర్తతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైంది. అనంతరం తన భర్త, బంధువులకు చెందిన ఇద్దరు పిల్లలతో బైక్​పై ఇంటికి బయలు దేరింది. అయితే వీరి బైక్​ యూ టర్న్​ తీసుకుంటుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్​ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఘటన అనంతరం లారీ డ్రైవర్​ ఆపకుండా పారిపోయాడు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Petrol Price Hike | ఇంధన మంట : సామాన్యుడిపై ‘ఇరాన్ యుద్ధ’ సెగ.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *