Mahesh Goud | అందుకే ర్యాలీలో పరుగెత్తా : పీసీసీ చీఫ్​

రాహుల్ గాంధీ పర్యటనలో తాను పరుగెత్తిన వీడియో వైరల్​ కావడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ స్పందించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahesh Goud | కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ఉదయం హైదరాబాద్​లో గిగ్​వర్కర్స్​ ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఆయనతో పాటు సీఎం రేవంత్​రెడ్డి వేర్వేరు బైక్​లపై కూర్చొగా.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​, మంత్రి వివేక్​ పరిగెడుతూ కనిపించిన వీడియో వైరల్​ అయింది.

ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాహుల్​ గాంధీ వెనకాల మంత్రి, పీసీసీ అధ్యక్షుడు పరుగెత్తడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ స్పందించారు. తన బైక్​ స్కిడ్​ కావడంతో వెనకాల ఉండిపోయానని చెప్పారు. తాను ఆయన పక్కన లేకపోవడం చూసి రాహుల్ పిలిచారన్నారు. ‘నేను ఫిట్‌గా ఉన్నందున పరుగెత్తాను. మా నాయకుడితో పాటు పరుగెత్తడం నా అదృష్టం’ అని మహేశ్​ గౌడ్​ అన్నారు.

Mahesh Goud | సమస్యలు తెలుసుకున్నారు

రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, సోనియా గాంధీ జీవిత చరిత్రను ప్రశంసిస్తూనే రాహుల్ గాంధీ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారని మహేశ్ గౌడ్​ తెలిపారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర సమస్య గురించి తెలుసుకున్నారని చెప్పారు. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు.

ఇది కూడా చదవండి..: Gig Workers Policy | గిగ్​ వర్కర్లకు అండగా ఉంటాం : రాహుల్​ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *