అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు , నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అగ్రనేతలు మెరుపు ధర్నా చేపట్టడంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy | యువతకు కాంగ్రెస్ అండగా ..
యువతపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ.. దేశ భవిష్యత్ ఆశాకిరణం రాహుల్ గాంధీ నిరసన చేపట్టారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న యువతకు ధైర్యం చెబుతూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువతకు తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Revanth Reddy | రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం..
ప్రధాని మోడీ నివాసం ముందు కాంగ్రెస్ చేపట్టిన మెరుపు ధర్నా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఉంచిన డిమాండ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించిన అనంతరం, ఆయన మరోసారి రాహుల్ గాంధీతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా ‘రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ అన్నట్లుగా మారిపోయాయి.
The Hope of India, Shri @RahulGandhi is on protest for the Future of India, seeking resignation of Prime Minister Modi and Home Minister Amit Shah.
Our national president Shri Mallikarjun Kharge ji and Smt Priyanka Gandhi ji are giving courage and extending fullest support to… pic.twitter.com/4VhFTmwZVH
— Revanth Reddy (@revanth_anumula) July 21, 2026
ఇది కూడా చదవండి: Karate Guinness Record | గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను అభినందించిన పీసీసీ చీఫ్..