అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Karate Guinness Record | గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు కరాటే క్రీడాకారులు మంగళవారం జిల్లాకు వచ్చేసిన పీసీసీ చీఫ్ (PCC Chief)ను కలువగా ఆయన వారిని అభినందించి సన్మానించారు.
Karate Guinness Record | అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలి
బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు కరాటేలో గిన్నిస్ రికార్డ్ సాధించడం గొప్ప విషయమన్నారు. కరాటే మాస్టర్, తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బృస్లీ అవార్డ్ గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ఈ ఘనత సాధించడం భేష్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ తన కరాటే గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్‌ను గుర్తు చేసుకున్నారు. కరాటేలో గిన్నిస్ రికార్డ్‌లో భాగంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించిన కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్, ఎడ్ల రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్, స్టేట్ లెవల్ కరాటే సిల్వర్ మెడలిస్ట్ నచికేతన్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటేలో తైకీకి షోదన్ కటాను 800 మూవ్‌మెంట్స్‌ను ఏకదాటిగా 20 నిమిషాల పాటు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించామని వివరించారు.
ఇది కూడా చదవండి..: Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్‌లు.. ఆందోళనలో రైతన్నలు..