అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial BJP Leader | జగిత్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్‌తో భారతీయ జనతా పార్టీ (BJP) పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) తీవ్రంగా స్పందించారు. మహిళా ఉద్యోగి పట్ల అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇటువంటి ఘటనలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సమర్థించదని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎంపీ బాధిత అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిన పరిణామాల పట్ల తన తరఫున క్షమాపణలు తెలియజేస్తూ, బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్‌తో పాటు ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తోటి అంగన్వాడీ టీచర్లను కూడా ఎంపీ అభినందించారు. ఉద్యోగులు తమ విధులను స్వేచ్ఛగా, గౌరవప్రదమైన వాతావరణంలో నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
Jagtial BJP Leader | కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ వ్యవహారంలో అంగన్వాడీ సూపర్వైజర్ను కూడా బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలను ఎంపీ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఘటనను రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి పార్టీపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Modi Putin Meeting | చర్చలతోనే ఘర్షణలకు పరిష్కారం.. పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ