Madhavnagar ROB | మాధవనగర్​ వంతెనపై కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు విమర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Madhavnagar ROB | మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర  మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు విమర్శించారు. నగర శివారులోని(Nizamabad) మాధవనగర్​రైల్వే బ్రిడ్జి వద్ద జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

Madhavnagar ROB | ఏళ్లుగా సాగుతున్న పనులు..

ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీలోపు ఆర్వోబీ పనులు పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంపై నర్సింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్పితే కార్యరూపం దాల్చడం లేదని పేర్కొన్నారు. పనులు పెండింగ్​లో పడడంతో ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందన్నారు. 2022 జనవరి 27వ తేదీన పనుల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పనులు కొనసాగుతుండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.

Madhavnagar ROB | వంతెన వద్ద అస్తవ్యస్తం

వంతెన వద్ద కనెక్టివిటీ రోడ్డు సరిగ్గా లేక దుమ్ము, బురద, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. అంబులెన్స్​లు, స్కూల్ బస్సులు, అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే నిధులు పూర్తిగా విడుదల చేసి ఆర్వోబీనీ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు దేగాం యాదాగౌడ్​, నియోజకవర్గ మాజీ ఇన్​ఛార్జీ బొబ్బ నరసింహారావు, కర్ర వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రెంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, ఆనంద్, కల్లెడ గంగాధర్, బాలగంగాధర్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ రక్షణ సేన నాయకుల అరెస్ట్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *