అక్షరటుడే, కామారెడ్డి: Har Ghar Tiranga Rally | పట్టణంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని జాతీయ జెండాను చేతబూని కార్యకర్తలు, నాయకులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడిచారు.
Har Ghar Tiranga Rally | గాంధీ గంజ్ నుంచి..
పట్టణంలోని గాంధీ గంజ్ నుంచి మొదలైన ఈ ర్యాలీ జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్, ధర్మశాల, ఇందిరాచౌక్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. నిజాంసాగర్ చౌరస్తాలో జనగణమన జాతీయ గీతాళాపనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బీజేపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bheemgal Tahsildar Office | భీమ్‌గల్ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు.