Bheemgal Tahsildar Office | భీమ్‌గల్‌ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు

భీమ్​గల్​ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గురువారం తనిఖీ చేశారు.

shashi kiran Mottala

భీమ్‌గల్‌, అక్షర‌టుడే: Bheemgal Tahsildar Office | మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Abhigyan Malviya) గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వివిధ సేవలపై సమీక్షించారు.

Bheemgal Tahsildar Office | పెండింగ్ దరఖాస్తులపై ఆరా..

ముఖ్యంగా ‘భూభారతి’ పోర్టల్‌లోని పెండింగ్ దస్త్రాలను, దరఖాస్తుల స్థితిగతులను సబ్ కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పోర్టల్‌లో దస్త్రాల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ మల్లేష్, స్వాతి, కార్యాలయ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Bheemgal Tahsildar Office

ఇది కూడా చదవండి:Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *