Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్తెలంగాణ

BC Commission Visit | 7న నిజామాబాద్​కు బీసీ కమిషన్​.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం

నిజామాబాద్​ జిల్లాలో వీడీసీల బహిష్కరణపై బీసీ కమిషన్​ ఈ నెల 7న సమావేశం నిర్వహించనుంది.

Srinivas Kolluri
Last updated: October 5, 2026, 6:40 pm 6:40 pm
Srinivas Kolluri
Share
BC Commission Visit

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Commission Visit | బీసీ కమిషన్​ ఈ నెల 7న బుధవారం నిజామాబాద్​కు రానుంది. వీడీసీల గ్రామ బహిష్కరణలపై అధికారులతో కమిషన్​ సమావేశం నిర్వహించనుంది.

ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్​లో గౌడ, ఎస్సీ కులాలకు చెందిన పలువురిని ఇటీవల వీడీసీ సామాజిక బహిష్కరించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా బీసీ, గౌడ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ కమిషన్​ స్పందించింది. తాళ్లరాంపూర్​తో పాటు జిల్లాలోని 23 గ్రామాల్లో బహిష్కరణకు గురైన బాధితులతో మాట్లాడాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ కమిషన్​ ప్రత్యేక కార్యదర్శి బాలమాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

BC Commission Visit | అధికారులతో భేటీ

జిల్లాలో గ్రామ అభివృద్ధి అభివృద్ధి కమిటీల (VDC) సామాజిక బహిష్కరణ ఘటనలు, సామాజిక బహిష్కరణ బాధితులు, దాని నివారణ చర్యలపై జిల్లా యంత్రాంగం, పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని బీసీ కమిషన్​ తెలిపింది. తాళ్లరాంపూర్​లో గౌడ కులస్తుల బహిష్కరణపై కమిషన్​ ఈ నెల 3న సమావేశంలో చర్చించింది. జిల్లాలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరగడాన్ని తీవ్రంగా పరిగణించిందని ఆమె పేర్కొన్నారు.

BC Commission Visit | బాధితులు హాజరు కావాలి

కమిషన్ ఈ నెల 7న నిజామాబాద్‌ (Nizamabad)ను సందర్శించి, జిల్లాలోని గ్రామ అభివృద్ధి కమిటీలు విధించిన సామాజిక బహిష్కరణల బాధితులతో మాట్లాడాలని నిర్ణయించింది. ఆయా గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల బాధితులు తమ సమస్యలను తెలియజేయడానికి కమిషన్ ముందు హాజరయ్యేలా చూడాలని పోలీసులను కమిషన్​ ఆదేశించింది. ఆ గ్రామాలు నాగపూర్, వేల్పూర్, మారంపల్లి, నందిపేట్, గుమ్మిర్యాల్, ఏర్గట్ల, పిప్రి, దోమచంద, సావెల్, నాగంపేట, మంథని, తాళ్ల రాంపూర్, జక్రాన్‌పల్లి, చేంగల్​, చౌట్‌పల్లి, మోతే, బస్సాపూర్, పచ్చల్‌ నడ్కుడ, మిర్దాపల్లి, దేగాం (ఆర్మూర్​), అమ్దాపూర్, మిట్టపల్లి, దేగం (ఆలూరు), అంకాపూర్. ఈ గ్రామాల్లోని వీడీసీల బాధితులతో పాటు కలెక్టర్, పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఆయా మండలాల్లోని ఎస్​హెచ్​వోలు, బీసీ సంక్షేమ అధికారితో బీసీ కమిషన్​ సమావేశం నిర్వహించనుంది.

కమిషన్​ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి రంగూ జిల్లాలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు కమిషన్​ నగరానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కలెక్టరేట్​లో సామాజిక బహిష్కరణకు గురైన బాధితులతో మాట్లాడుతుంది. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 04:30 వరకు అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది.

దీనిని కూడా చదవండి : Tallarampur VDC Action | తాళ్లరాంపూర్​ వీడీసీపై చర్యలు తీసుకోవాలి

TAGGED:BC CommissionBC Commission VisitNizamabad NewsNizamabad VDCsSocial Boycottsocial boycott victimsTelangana NewsVDC social boycott
Srinivas Kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Monday Shiva Puja Monday Shiva Puja | సోమవారం శివారాధన ఎందుకు అంత ప్రత్యేకం? చంద్రుడికి, మహాశివుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా
Next Article Nizamabad Teachers Day | Nizamabad Teachers Day | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

K Kavitha Allegations
తెలంగాణ

K Kavitha Allegations | తెలంగాణలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్ కుట్ర : కవిత

By Naresh Chandan
KTR Clarification
తెలంగాణ

KTR Clarification | క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు తప్పవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

By Shivam nagarani
RJ Charan Bigg Boss
సినిమాతెలంగాణనిజామాబాద్

RJ Charan Bigg Boss | రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్‌కు.. నిజామాబాద్ కుర్రాడి జోరు

By Naresh Chandan
Kamareddy Police Rescue
నిజామాబాద్

Kamareddy Police Rescue | తక్షణ స్పందన.. తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.