Tallarampur VDC Action | తాళ్లరాంపూర్​ వీడీసీపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్​ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు, గౌడ కుల సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: Tallarampur VDC Action | తాళ్లరాంపూర్​ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ (BC, SC, ST, JAC), ధర్మసమాజ్ పార్టీ నాయకులు, గౌడ కుల సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు పట్టణంలో రహదారిపై ధర్నా నిర్వహించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండెల సుమన్ మాట్లాడుతూ.. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ వారు 39 గీత కార్మిక, 11 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. ఈ విషయమై గతనెల 28న కలెక్టర్ (Nizamabad)​ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు జేఏసీ, గౌడ, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆర్మూర్​ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.

Tallarampur VDC Action | వీడీసీలను రద్దు  చేయాలి

రాజ్యాంగ విరుద్ధమైన వీడీసీలను వెంటనే రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. వీడీసీ ముసుగులో కొందరు బీసీ,ఎస్సీ ఎస్టీలపై పెత్తనం చెలాయిస్తూ బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి బాధితుల పక్షాన లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వారు స్పందించి బాధితుల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామా గౌడ్, ప్రేమ్, మహిపాల్, మెడ గంగారాం, సుదర్శన్, మురళి, ఉమేష్, మహేష్, భుమేష్, మహిపాల్, మహేష్, నర్సా గౌడ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ.5,250లు అదనం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *