అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bar Owners Protest | జిల్లావ్యాప్తంగా సోమవారం బార్లు మూసి ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. విచ్చలవిడి పర్మిట్‌రూంల ఏర్పాటును నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట
Bar Owners Protest | ప్రివిలేజ్ ట్యాక్స్ పేరుతో వడ్డన..
రాష్ట్రవ్యాప్తంగా బార్లపై ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ప్రతి బార్10శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ కట్టాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బార్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఇప్పటికే బార్లను నడిపించడంలో ఇబ్బందులు పడుతున్న తమకు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడడం ఎంతమాత్రం సరైంది కాదని వారు పేర్కొంటున్నారు.
Bar Owners Protest | విచ్చలవిడిగా పర్మిట్ రూంలతో..
అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైన్స్‌ల వద్ద విచ్చలవిడిగా పర్మిట్ రూంలు ఏర్పాటు చేయడంతో బార్లకు గిరాకీ లేకుండా పోయిందని నిర్వాహకులు వాపోతున్నారు. ఒక పర్మిట్ రూం కేవలం 100 గజాల్లో ఉండాల్సి ఉండగా.. అడ్డదిడ్డంగా విశాల ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేసి బార్ల పొట్టగొడుతున్నారని వారు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూంలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ స్పందించడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే ప్రివిలేజ్ ట్యాక్స్ తీసివేయాలని.. పర్మిట్రూం నిబంధనలు పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిజామాబాద్ జిల్లా బార్ల అసోసియేషన్ అధ్యక్షుడు దేవన్న, కార్యదర్శి సంతోష్, విన్ను, జనార్ధర్, విశ్వనాథ్, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Bheemgal Tea Seller | పోలీస్ స్టేషన్ ఎదుట చాయ్ హోటల్ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం