Stray Dog Attack | వీధికుక్కల దాడి.. చిన్నారికి గాయాలు..

వీధికుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Stray Dog Attack | వీధికుక్కల (Stray Dog) దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది.

Stray Dog Attack |పట్టణంలోని టీచర్స్​ కాలనీలో..

పట్టణంలోని టీచర్స్​ కాలనీలో గోతి నానక్ సింగ్ కుమార్తె రిషిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారి కేకలు విని స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి ఆమెను రక్షించారు. అనంతరం చిన్నారిని బాన్సువాడ మాతా-శిశు సంరక్షణ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. చిన్నారి గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

Stray Dog Attack |108 సిబ్బంది సమయస్ఫూర్తి..

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్(108 Ambulanc) సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ సుభాష్ స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ వైద్యుల సూచనల మేరకు చిన్నారికి అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందిస్తూ సురక్షితంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని వేగంగా ఆస్పత్రికి చేర్చినందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు 108 అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనతో టీచర్స్ కాలనీతో పాటు బాన్సువాడ పట్టణ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటీవల వరుసగా వీధికుక్కల దాడులు జరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధుల భద్రత కోసం మున్సిపల్ అధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి వీధికుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *