Excise Constable | లారీ డ్రైవర్ల వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లు.. సస్పెన్షన్​కు సిఫార్సు చేసిన సూపరింటెండెంట్​

మద్నూర్ సలాబత్​పూర్​ చెక్​పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై ఉన్న‌తాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Excise Constable | ఎక్సైజ్ అధికారులు (Excise Department) వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మద్నూర్ సలాబత్​పూర్​ చెక్​పోస్ట్ (Madnur Checkpost)​ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Excise Constable | క్షణాల్లో వీడియో వైరల్​..

యూనిఫాంలో ఉన్న ఒక అధికారి లారీ డ్రైవర్​ను డబ్బులు డిమాండ్ చేయగా సదరు డ్రైవర్ అధికారి వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. అలాగే అధికారితో పాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కూడా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా వీడియోలో క‌నిపించింది. లారీ డ్రైవర్ వీడియో తీస్తుండడాన్ని గమనించిన అధికారి డబ్బులేమీ అవసరం లేదని మాట మార్చాడు. అలాగే వెనకాల వచ్చిన మరొక వాహనం వద్ద ప్రైవేట్ వ్యక్తి నిలబడగా ఆ దృశ్యాన్ని కూడా వీడియో తీయడంతో సదరు ప్రైవేట్ వ్యక్తికి వాహన డ్రైవర్ డబ్బులిచ్చినా తీసుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా అధికారులు సదరు ఉద్యోగిపై చర్యలకు ఉపక్రమించారు.

Excise Constable | సస్పెన్షన్​కు నివేదిక పంపాం..: ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి

అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను గత రెండు దశాబ్దాలుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా (Kamareddy) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్, చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ముకుంద రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ప్రాథమిక విచారణలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యుడని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నోడల్ అధికారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ముకుంద రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: MV Electrosystems IPO | పబ్లిక్ ఇష్యూకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *