అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress Protest | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాదయాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ (Kamareddy Congress) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. హల్ద్వానీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధీ చేసిన ఘటనను ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
Kamareddy Congress Protest | ఖర్గేకు సంఘీభావంగా..
మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు (Mallikarjun Kharge) సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర, సత్యాగ్రహాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహాత్మా గాంధీ లేదా అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర అనంతరం సత్యాగ్రహం నిర్వహించి, వివక్ష, అంటరానితనం, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..