అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరువు రావాలని, జనాలు చావాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కేసీఆర్ పరిస్థితి అని విమర్శించారు. ఇవాళ కేసీఆర్‌ను మింగేయడం కోసం అఘోర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ చేతబడి తిరగబడితే.. వారిని అష్టదిగ్బంధనం చేస్తుందన్నారు. ఎల్‌నినో వచ్చిన సమయంలో దేవుడు వానలు కురిపించాడన్నారు. వాళ్లు అఘోర పూజలు చేసినా.. దేవుడు తనవైపు ఉండి వానలు కురిపించి జలాశయాలు నింపాడన్నారు.
CM Revanth Reddy | కూకట్‌పల్లిని అభివృద్ధి చేస్తాం
కూకట్పల్లి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటానని సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతామన్నారు. పదేళ్ల ఆ పరిపాలనను, రెండేళ్ల ఈ పరిపాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. ఆ నాడు దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు దాణాగా పెట్టారని, తాము రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. 55 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని తెలిపారు. ఈ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Eagle Force | ఈగల్ టీమ్‌పై కుక్కను వదిలిన గంజాయి ముఠా