Eagle Force | ఈగల్ టీమ్‌పై కుక్కను వదిలిన గంజాయి ముఠా

హైదరాబాద్​ నగరంలోని బాలానగర్​లో తాజాగా ఈగల్​ టీమ్​ భారీ ఆపరేషన్​ చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Force | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో గంజాయి దందా ఆగడం లేదు. ఈగల్​ ఫోర్స్​, ఎస్​వోటీ (SOT) పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా చేస్తూ కొందరు డబ్బులు సంపాదిస్తున్నారు.

హైదరాబాద్​ నగరంలోని బాలానగర్​లో తాజాగా ఈగల్​ టీమ్​ భారీ ఆపరేషన్​ చేపట్టింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి 14 కిలోల గంజాయి స్వాధీనం చేనసుకుంది. బాలానగర్​లోని ఓ ఇంట్లో గంజాయి దందా సాగుతోందని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై దాడులు చేశారు. అయితే నిందితులు అధికారులపై కుక్కను వదిలారు. కుక్కను అడ్డు పెట్టుకొని తప్పించునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా నిందితులు ఓ అధికారిపై దాడి చేశారు.

Eagle Force | ముగ్గురు అన్నదమ్ములు కలిసి..

స్థానికంగా ఉండే ముగ్గురు అన్నదమ్ములు దుర్గాప్రసాద్, రవి, కిరణ్‌ గంజాయి దందా చేస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసి గంజాయి విక్రయిస్తున్నారు. ఈగల్​ టీమ్​ అధికారులు దాడులు చేసి ఈ ముగ్గురితో పాటు కమలాకర్​ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒడిశా (Odisha) నుంచి పెద్ద ఎత్తున గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పేమెంట్ చేసిన వారికి వాట్సాప్ లో లొకేషన్ అడిగి నేరుగా గంజాయి సప్లై చేస్తున్నారు. కొందరు డబ్బు కోసం గంజాయి దందా చేస్తుండగా.. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Sewing Machines | బీసీ మహిళలకు అదిరిపోయే న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *