Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు చేయాలి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈనెల 15న పక్కాగా నిర్వహించాలని కలెక్టర్​ భవేశ్​ మిశ్రా ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Smart Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 15న చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల (ration cards) పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ భవేశ్​ మిశ్రా(Collector Bhavesh Mishra) ఆదేశించారు. కలెక్టరేట్​లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.

Smart Ration Cards | 15న సంగారెడ్డిలో సీఎం ఆధ్వర్యంలో..

ఈనెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2గంటల సమయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారని కలెక్టర్​ పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్​లో ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు హాజరు కానున్న దృష్ట్యా, పక్కాగా ఏర్పాట్లు ఉండాలన్నారు.

Smart Ration Cards | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను..

ఈనెల 15న ఉదయం వేళ పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో జరిగే స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక ఉండాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్, డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీవో సాయన్న, సీపీవో కిషన్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Indiramma Sewing Machines | బీసీ మహిళలకు అదిరిపోయే న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్లు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *