Rajaram Dubba Cordon | రాజారాం దుబ్బలో కార్డన్​ సెర్చ్​.. పలు వాహనాలు సీజ్

బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బలో బుధవారం ఉదయం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్​ సర్చ్‌ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Rajaram Dubba Cordon | పట్టణంలోని రాజారాం దుబ్బలో బుధవారం ఉదయం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్​ సర్చ్‌ నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ వందలాది మంది పోలీసు సిబ్బంది కాలనీలోకి ప్రవేశించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Rajaram Dubba Cordon | 140 మంది పోలీసులు..

ఈ కార్డన్​ సెర్చ్​లో 140మంది పోలీసులు పాల్గొన్నారు. దీంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కార్డన్‌ సెర్చ్ (Cordon search)​లో భాగంగా రాజారాం దుబ్బ ప్రాంతంలోని ప్రధాన రహదారులు, కాలనీకి వెళ్లే మార్గాలు, గల్లీల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాలనీని పూర్తిగా చుట్టుముట్టిన వారు ఇళ్లల్లో, రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని కొన్ని వాహనాల వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో కాలనీలోని దుకాణాలు, ఇళ్లను కూడా పోలీసులు తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను విచారించారు.

Rajaram Dubba Cordon | గంజాయి.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాలు వంటి సామాజిక రుగ్మతలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కాలనీకి మంచి పేరు తీసుకురావడంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డన్‌ సర్చ్‌ ద్వారా కాలనీలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టవచ్చని డీఎస్పీ తెలిపారు. ఈ సెర్చ్​లో 112 బైక్​లు, 5 కార్లు, 19 ఆటోలను తనిఖీ చేసి 13 బైక్​లు, 1 ఆటోను సీజ్​ చేశారు. సీఐ తుల శ్రీధర్, ఎస్సైలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kalyani Project Flood | కళ్యాణి ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద..​ రెండు గేట్లు ఎత్తివేత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *