Kalyani Project Flood | కళ్యాణి ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద..​ రెండు గేట్లు ఎత్తివేత

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalyani Project Flood | మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ (Kalyani Project) జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది.

Kalyani Project Flood | దిగువకు నీటి విడుదల..

వర్షాలకు వరద పెరుగుతుండడంతో నిజాంసాగర్ (Nizamsagar) ప్రధాన కాలువలోకి నీటిని మళ్లిస్తున్నారు. ప్రాజెక్ట్​ రెండు వరద గేట్ల ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 430 క్యూసెక్కులు వరద వస్తుండగా.. ఫ్లడ్ గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు 180 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు.  ప్రస్తుత నీటి మట్టం ఫుల్​ రిజర్వాయర్​ లెవల్​(ఎఫ్​ఆర్​ఎల్​) కంటే 0.9 మీ తక్కువగా ఉంది. గత ఏడాది భారీ వరదలకు కళ్యాణి ప్రాజెక్టు సైడ్ వాల్స్ కొట్టుకుపోయాయి. దీంతో మరమ్మతులు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వరద నీటిని ఎక్కువ నిల్వ చేయకుండా వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Munna Snake Rescuer | వన్యప్రాణుల సంరక్షణలో యువతకు మున్నా స్ఫూర్తిదాయకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *