Munna Snake Rescuer | వన్యప్రాణుల సంరక్షణలో యువతకు మున్నా స్ఫూర్తిదాయకం

వన్యప్రాణుల సంరక్షణలో యువతకు మున్నా అనే యువకుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని ఫారెస్ట్​ అధికారులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నందిపేట్: Munna Snake Rescuer | వన్యప్రాణుల సంరక్షణలో యువతకు మున్నా అనే యువకుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని ఫారెస్ట్​ అధికారులు పేర్కొన్నారు. ఎంపీడీవోతో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.

Munna Snake Rescuer | స్నేక్​ క్యాచర్​

నందిపేట్ మండల (Nandipet Mandal) కేంద్రానికి చెందిన వన్యప్రాణులను రక్షించే మున్నాబాయ్​(స్నేక్ రెస్క్యురర్​)ను మండల ఎంపీడీవో, ఫారెస్ట్ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఘనంగా సత్కరించారు. గ్రామాల్లోకి, ఇళ్లలోకి చొచ్చుకొచ్చే పాములు ఇతర వన్యప్రాణులను ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా పట్టుకొని అడవుల్లో వదిలేస్తున్నాడని వారు పేర్కొన్నారు. ప్రజలకు హాని జరగకుండా అత్యంత సాహసోపేతంగా వ్యవహరిస్తున్న మున్నా సేవలను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శ్రీనివాసరావు, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, బీట్​ ఆఫీసర్ లింబాద్రి, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళ సంఘ సభ్యులు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jagtial Train Accident | జగిత్యాలలో రైలు ప్రమాదం..నిజామాబాద్​ వాసి దుర్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *