అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagtial Train Accident | జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Jagtial Train Accident | గాండ్లపేట వాసిగా…
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడు నిజామాబాద్ జిల్లా గాండ్లపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.