అక్షరటుడే, డిచ్పల్లి: Forest Officials Obstructed | అటవీ భూమిని (Forest Department) అక్రమంగా ట్రాక్టర్లతో దున్నుతుండగా అధికారులు అడ్డుకున్నారు. అయితే వారి విధులను అడ్డగించిన ఏడుగురు వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌లో (Dharpally) కేసు నమోదైంది.
Forest Officials Obstructed | ధర్పల్లిలోని డీబీ తండాలో..
ధర్పల్లి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. డీబీ తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా భూమిని దున్నుతున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని, అక్రమంగా భూమిని దున్నుతున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీబీ తండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు అటవీ అధికారులను అడ్డుకుని, వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీనిపై దుబ్బాక బీట్ ఆఫీసర్ వెంటనే ధర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Chandipura Virus | గుజరాత్‌లో వేగంగా విజృంభిస్తున్న చండీపురా వైరస్.. 22 మంది చిన్నారులు మృతి