Banswada Hostel | హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్​ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Hostel | ఇంటర్​ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ(Banswada) పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.

Banswada Hostel | డోంగ్లి మండల లక్ష్మాపూర్​..

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అమృత (18) బాన్సువాడలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో( SC Girls Hostel) ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం ఆమె కాలేజీకి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయింది. అనంతరం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, డీఎస్పీ విఠల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

banswada

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *