Paddy Farmers Protest | అన్నదాతల ఆగ్రహ జ్వాల.. నడిరోడ్డుపై ధాన్యం తగలబెట్టి నిరసన

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Farmers Protest | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా అన్నదాతలు ఆగమవుతున్నారు. ధాన్యం రైస్​మిల్లులకు తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి–హైదరాబాద్​ రోడ్డుపై బుధవారం ధాన్యం తగలబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు.

Paddy Farmers Protest | నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డిలో..

నాగిరెడ్డిపేట మండలం (Nagireddypeta Mandal) కన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తరలించేందుకు కొన్నిరోజులుగా లారీలు రావట్లేదు. దీంతో రైతులు బుధవారం ధాన్యం బస్తాలను ఎల్లారెడ్డి–హైదరాబాద్ రోడ్డుపై తగలబెట్టి ధర్నాకు దిగారు. కేంద్రంలో తూకాలు అయినప్పటికీ రోజుల తరబడి ధాన్యం బస్తాలు అక్కడే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ఆందోళన నెలకొందన్నారు. నెల రోజులుగా కేంద్రంలోనే రేయింబగళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Paddy Farmers Protest | అకాల వర్షాలతో ఆందోళన..

Paddy Farmers Protest

అకాల వర్షాల కారణంగా పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుందని రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేశారు. పండించడం కంటే విక్రయించడమే కష్టంగా మారింని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకపక్క వర్షాలు కురుస్తుండటంతో ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసి ముద్ద అవుతోందని, దానిని మళ్లీ ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు పెరుగుతున్నాయన్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. ధాన్యం బస్తాలు తరలించేలా లారీలను ఏర్పాటు చేసేవరకు తాము ధర్నా నుండి విరమించేది లేదని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *