Palle Davakhana | పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Palle Davakhana | పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. సాలూర (saloora) మండలంలోని హున్సా(Hunsa) గ్రామంలో బుధవారం పల్లె దవాఖానాను ప్రారంభించారు.

Palle Davakhana | అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

హున్సాలో ‘మహాలక్ష్మి మాత’ విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ హైస్కూల్​లో సమస్యను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని డీఈవో అశోక్​ను ఆదేశించారు. కుమ్మన్​పల్లి రోడ్​లో వంతెన సమస్యను తెలుపగా వెంటనే పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ దేవతల మందిరాల ముందర సీసీ రోడ్, గ్రామంలోని బీరప్ప మందిరం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

Palle Davakhana | స్థల దాతలకు సన్మానం

పల్లె దవాఖానా, అంగన్​వాడీ భవన నిర్మాణాలకు స్థలాలు ఇచ్చిన స్థల దాతలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్పంచ్, గ్రామస్థులు సన్మానించారు. అనంతరం బోధన్​ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సాలురా పార్టీ అధ్యక్షుడు మందర్నా రవి, బోధన్ ఏఎంసీ ఛైర్మన్ చీల శంకర్, హున్సా సర్పంచ్ మార్కల్ శివకుమార్ పాల్గొన్నారు.

suda11

ఇది కూడా చదవండి : కేరళ: కొట్టాయం రోడ్డుపై ఉన్న గుంతలను ఎత్తిచూపేందుకు, అరటి మొక్కలను నాటి బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *