అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Employees Welfare | జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది. మంగళవారం జిల్లా ఎక్సైజ్ అధికారి నందగోపాల్‌ను కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Excise Employees Welfare | బాసర జోన్ పరిధిలో..
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (DPEO) కార్యాలయంలో మంగళవారం బాసర జోన్ (CD2) పరిధిలో ఇటీవల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెచ్‌సీ, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైంది. కమిటీకి ఛైర్మన్‌గా కైలాస్ పవార్, వైస్ ఛైర్మన్‌గా లింబాద్రి, కోశాధికారిగా చల్లా బాబు కలిసి జిల్లా ఎక్సైజ్ అధికారిని కలువగా ఆయన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ కోశాధికారి భాస్కర్ రావు, డీటీఎఫ్ జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ విలాస్ కుమార్, డీపీఈవో కార్యాలయ ఏఏవో నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, శేఖర్ రాజ్, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: TNGO Dharna Nizamabad | 27న టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా