H1N1 Cases Delhi | పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు.. ఢిల్లీ సీఎం అత్యవసర సమావేశం..

దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: H1N1 Cases Delhi | దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) మంగళవారం అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.

H1N1 Cases Delhi | మూడు వేల ఇన్​ఫ్లూయెంజా కేసులు

ఆరోగ్య శాఖ, ఎంసీడీ, ఎన్‌డీఎంసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఈ ఏడాది సుమారు 3,000 ఇన్​ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయని తెలిపారు. వాటిలో 2,308 హెచ్1ఎన్1 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేదు. కేసుల నేపథ్యంలో సీఎం అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి సమస్య లేదని, అంతా అదుపులోనే ఉందని చెప్పారు.

H1N1 Cases Delhi | పాఠశాలలకు అడ్వైజరీ

స్వైన్ ఫ్లూ (H1N1)తో సహా సీజనల్ ఇన్​ఫ్లూయెంజా నుంచి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యాశాఖ ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు అడ్వైజరీ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరోగ్య అవగాహనను పెంచుకోవాలని, మరియు ఇన్ఫెక్షన్ నివారణ, శ్వాసకోశ పరిశుభ్రత చర్యలను పటిష్టం చేసుకోవాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి..: Caste Census Data | ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *